శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి |Shree Bala Tripura Sundari Devi

Share now!

శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి |Shree Bala Tripura Sundari Devi

త్రిపురుని భార్య త్రిపుర సుందరీ దేవి, అంటే ఈశ్వరుడి భార్య అయిన గౌరి దేవి అని అర్ధం. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం బాల త్రిపుర సుందరిదేవి ఆధీనంలో ఉంటాయి. అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన దేవిని ఆరాధిస్తే మనో వికారాలు తొలగి పోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. త్రిపుర సుందరిదేవి శ్రీ చక్రంలోని త్రిపురా త్రయంలో మొదటి దేవత. షొడస విద్యకు ఈమే అధిష్ఠాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలర్చన చేస్తారు. అసలు బాల త్రిపుర నామమే పరమ పవిత్రమైన నామము. త్రిపుర సుందరి అని అమ్మని పిలవడములో ఒక రహస్యము ఉంది. అమ్మ, అయ్య వారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇవిడేమో త్రిపుర సుందరి దేవి అయ్య వారు ఎమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వము కుడా అటువంటిది.

త్రిపుర సుందరి అంటే ” మనలోని ముాడు అవస్తలు జాగృత్త్ , స్వప్న , సుషుప్తి!
ఈ ముడు అవస్థలు లేద పురములకు బాల అధిష్ఠాన దేవత!

ఈ ముడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని అనుభవింప చేస్తు “బాలగా..”అమ్మవారు వినొదిస్తుంది. మనము ఎన్ని జన్మలు ఎత్తిన, ఈ ముడు అవస్థలులోనే తిరుగుతు ఉంటాము. కెవలం ఉపాధులు మాత్రమే మారుతాయి. అటువంటి తల్లి ఈ రూపములో మనలోనే ఉంది ఆవిడ ఆత్మ స్వరూపురాలు ఆవిడను పూజిస్తే ఙ్ఞ్నానము కలిగి తానె శివ స్వరూపము తో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మ తత్వం వైపు నడిపిస్తుంది🙏

Share now!

You may also like...

2 Responses

  1. ANITHA PATNAIK. KUPPILI. says:

    Om Shree Bala Tripura Sundari Devi Namaha

  2. Shiva says:

    Om Shree mathre namah 🙏😇

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To make donations:
Donate with PayPal