నమ్మకం | Nammakam

Share now!

నమ్మకం

ఒక చిన్న గదిలో నాలుగు మైనపు దీపాలు వెలుగుతూ ఉన్నాయి.
ఇంతలో పెద్దగా గాలి రావడం మొదలయింది.

ప్రశాంతత అనే మైనం ఈ గాలికి నేను ఆరిపోతానేమో అని బయపడింది గాలి రావడంతో ఆరిపోయింది.

ప్రేమ అనే మైనం కూడా ఈ గాలిని నేను కూడా తట్టుకోలేను నేను ఆరిపోతానేమో అని అనడంతో రెండో దీపం కూడా ఆరిపోయింది.

తెలివి అనే దీపం కూడా నేను ఈ గాలిని ఎదిరించి వెలగలేనేమో అని భయపడుతూ ఆ గాలికి ఆగిపోయింది.

నాలుగో దీపం మాత్రం నేను ఎలాగైనా ఈ గాలిని ఎదిరించి వెలుగు ఇవ్వాలి ఆరిపోకూడదు అని తన వంతు ప్రయత్నం తాను చేసింది ఆ గాలిని ఎదిరించి వెలిగింది.

దీపాలు ఉన్న గదిలోకి చిన్న పిల్లవాడు వచ్చి అయ్యో మూడు దీపాలు ఆరిపోయాయే అని బాధ పడ్డాడు

బాధ పడుతున్న అబ్బాయిని చూసి దీపం ఇలా చెప్పింది
బాధపడకు నేను ఉన్న కదా నా నుండి ఆ మూడు దీపాలు వెలిగించుకో అన్నదట

సంతోషంతో ఆ పిల్లవాడు ఆ నాలుగో దీపాన్ని నీ పేరేంటి అని అడిగాడు
నా పేరు నమ్మకం అని చెప్పింది ఆ దీపం

అన్ని పోగొట్టుకున్నా మనపైన మనకు నమ్మకం ఉంటెే చాలు పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించేసుకోగలం.
🙏😇

Share now!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To make donations:
Donate with PayPal