ధ్యానం | Dhyanam – Meditation

Share now!

*ధ్యానం*

🍁🍁🍁🍁

నేడు మానవుని అసంతృప్తికి, అశాంతికి మూల కారణం ఇంద్రియములను, మనసును అదుపులో పెట్టుకోకపోవడమే.

ప్రాపంచిక విషయములు, కామవాంఛలు ఇంద్రియములను తమ వంకకు లాగుతాయి.

మనసు ఇంద్రియముల వెంట వెళుతుంది. దీని వలన బుద్ధి నిస్సహాయంగా మిగిలి పోతుంది.

అయితే వీటిని కట్టిపెట్టాలంటే ధ్యానము ఒక మంచి మార్గము.

ధ్యానంలో కూర్చుంటే ఇంద్రియములను, మనసును నిగ్రహించవచ్చును.

అప్పుడు అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది.

సాధారణంగా బయట ప్రపంచములో తిరుగుతున్నపుడు ఎన్నో వస్తువులను, విషయాలను, మనుషులను చూస్తుంటాము. మనసు వాటి మీద లగ్నం అవుతుంది.

ఆ ఆసక్తి కోరికగా మారుతుంది.

ఆ కోరికలు తీరకపోతే కోపం వస్తుంది.

కోపంలో ఏమి చేస్తున్నాడో తెలియని మోహం ఆవరిస్తుంది.

అప్పుడు మానవుడు విచక్షనా జ్ఞానం కోల్పోతాడు.

బుద్ధి పనిచెయ్యడం మానేస్తుంది

. జీవితము సర్వనాశనం అవుతుంది.

అదే మనసును మన వశంలో ఉంచుకుంటే ఈ విపరీత పరిణామములు సంభవించవు.

ధ్యానం చేయడం వలన మనస్సు ప్రసన్నంగా ఉంటుంది.

మనస్సు ప్రసన్నంగా ఉంటే దుఃఖములు నశిస్తాయి.

బుద్ధి పరమాత్మయందు లగ్నమై సంపూర్ణ ఆనందం ప్రాప్తిస్తుంది

🍁🍁🍁🍁

Share now!

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

To make donations:
Donate with PayPal